తగ్గిన కరోనా కేసుల సంఖ్య

24 గంటల్లో 38 మందికి కొవిడ్-19 

తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018గా ఉందని తెలిపింది.  రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5 కేసులు, కృష్ణాలో 3, నెల్లూరులో 1 , కర్నూలులో 9, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయి. 

Back to Top