కరోనా నియంత్రణపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి:  కోవిడ్ 19 నియంత్రణపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,90,077 శాంపిల్స్‌ను పరీక్షించారు.మరోవైపు గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 4,618 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 60,024కి చేరింది.   
 

Back to Top