కాసేపట్లో శారదా పీఠానికి సీఎం వైయ‌స్‌ జగన్‌

విశాఖ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
 

 విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పెందుర్తి మండలం చినముషిడివాడలో  శారదా పీఠానికి  మరికాసేపట్లో చేరుకుంటారు.  శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జగన్‌ పాల్గొంటారు. విశాఖ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

నేటి నుంచి శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.  శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న అనంతరం సీఎం వైయ‌స్ జగన్‌ అక్కడ స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top