వ‌ర‌ద‌ల‌పై కాసేప‌ట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాసేప‌ట్లో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతుండ‌టంతో జ‌లాశ‌యాలు నిండుకుండ‌లా మారాయి. శ్రీ‌శైలం జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేర‌డంతో 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌కాశం బ్యారేజ్‌కు వ‌ర‌ద పోటెత్తుతోంది. గంట గంట‌కూ వ‌ర‌ద ప్ర‌వాహం పెర‌గ‌డంతో 70 గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. దీంతో అధికారులు రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేశారు. న‌దీ ప‌రివాహ‌క ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. అమ‌రావ‌తి- విజ‌య‌వాడ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. 

Back to Top