రేపు దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోనున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌పై మంత్రి వెల్లంప‌ల్లి స‌మీక్ష‌

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోనున్నారు. శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా అమ్మ‌వారికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు. ఈ మేర‌కు మంత్రి వెల్లంప‌ల్లి మంగ‌ళ‌వారం ఉన్న‌తాధికారుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. మూల‌న‌క్ష‌త్రం సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నార‌ని మంత్రి తెలిపారు. ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని, కోవిడ్ దృష్ట్యా అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని మంత్రి సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top