పోల‌వ‌రంలో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏరియ‌ల్ వ్యూ

 కాసేప‌ట్లో జల వనరుల శాఖ అధికారులతో స‌మీక్ష‌
 

ప‌శ్చిమ గోదావ‌రి:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్  పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న డ్యామ్‌ పనులు, రేడియల్‌ గేట్లు, అప్రోచ్‌ చానల్‌, ఇత‌ర ప‌నుల‌ను ఏరియ‌ల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు. కాసేప‌ట్లో జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకరబాబు తదితర అధికారుల‌తో క‌లిసి ప్రాజెక్టు పురోగతిపై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తారు. గడువులోగా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలను వివ‌రిస్తారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top