గిడుగు జ‌యంతిని జ‌రుపుకోవ‌డం తెలుగు భాష‌ను స‌న్మానించుకోవ‌డ‌మే

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి:  గిడుగు రామ్మూర్తి జ‌యంతిని తెలుగు భాషా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవ‌డం తెలుగును స‌న్మానించుకోవ‌డ‌మేన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గిడుగు రామ్మూర్తి జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కృషిని సీఎం కొనియాడారు. గ్రాంధికాన్ని స‌ర‌ళీక‌రించి వ్య‌వ‌హారిక భాష‌లో ఉన్న అందాన్ని ప‌ల‌క‌డంలో ఉన్న సౌఖ్యాన్ని తెలియ‌జెప్పిన భాషోధ్య‌మ‌కారుడు గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు. పండితుల‌కే ప‌రిమిత‌మైన సాహిత్య సృష్టిని ర‌చ‌న భాష‌లో సామాన్యుల చేతికందించిన గిడుగు జ‌యంతిని తెలుగు భాషా దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం తెలుగు భాష‌ను నిజంగా స‌న్మించిన‌ట్లే అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top