ఇడుపులపాయకు బయల్దేరిన సీఎం వైయ‌స్ జగన్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ఇడుపుల‌పాయ‌కు బ‌య‌లుదేరారు. వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఇవాళ ప్రకటించనున్నారు.  వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top