20న వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనకు సీఎం వైయ‌స్‌ జగన్ 

వైయ‌స్ఆర్ జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 20వ తేదీన వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.  డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కడపకు రానున్న నేపథ్యంలో నగర సమీపంలోని జయరాజ్‌ గార్డెన్స్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ బి.వెంకట శివారెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.  

Back to Top