హైదరాబాద్‌ బయలుదేరిన సీఎం వైయ‌స్ జగన్‌

తాడేపల్లి : ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇటీవల కాలి తుంటి శస్త్ర చికిత్స చేసుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం వైయ‌స్ జగన్‌ పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్‌ నివాసానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.   

Back to Top