చంద్రబాబు తీరు అప్రజాస్వామికం...

అధికారులు చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారు

ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్‌పై ఖండించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

చిత్తూరు:ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు.చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల మీద టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చెవిరెడ్డిని భౌతికంగా అంతమొందించడానికి కూడా కుట్రలు పన్నుతున్నారన్నారు.ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసి రాత్రి అంతా పోలీసు వ్యాన్‌లో తిప్పుతూ.. నేడు సత్యవేడు పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం చాలా దారుణమన్నారు.చంద్రబాబు ఉన్మాదచర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలన్నారు.

అధికారులు చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారు: సునీల్‌కుమార్‌

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ధ్వజమెత్తారు.ఖండిచాల్సిన అధికారులు కూడా కూడా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి అర్ధరాత్రులు తిప్పడం బాధాకరమన్నారు.చంద్రబాబు ద్వంద వైఖరికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.జిల్లాలో ఉన్నత అధికారులు కూడా చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు.

 

 

 

   
Back to Top