వంగపండు మృతి కళారంగానికి తీరని లోటు

 వంగపండు మృతిపై మంత్రి బొత్స దిగ్భ్రాంతి

 విశాఖపట్టణం : సమకాలీన ప్రపంచంలో జానపదానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కళారంగానికి తీరని లోటని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వంగపండు మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దశాబ్దాల తరబడి కళాసేవ చేస్తూ, జానపదాలతో ప్రజల గొంతుకను వినిపించిన వంగపండు, ప్రజల మదిలో చిరకాలం నిలిచి ఉంటారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భవగవంతుడుని ప్రార్ధించారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top