విజయవాడ: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఆకర్శితులై రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీజేపీ నేతలు రొక్కం సొదరులు వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర రెవిన్యూ శాఖా మాత్యులు ధర్మాన. కృష్ణదాస్, రాష్ట్ర మత్స్య , పశు సంవర్ధక శాఖా మాత్యులు సీదిరి అప్పలరాజు సమక్షంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రొక్కం. సూర్యప్రకాష్, రొక్కం. సత్యన్నారాయణ, తదితరులు బీజేపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరారు. వీరికి మంత్రులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన రొక్కం సొదరులు మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ పాలనలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. సీఎం వైయస్ జగన్ పాలనకు ఆకర్శితులమై వైయస్ఆర్సీపీలో చేరుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, హనుమంతు, కిరణ్ కుమార్, అందవరపు .సూరిబాబు, తమ్మానవారి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.