అసెంబ్లీ ముందుకు సీఆర్‌డీఏ రద్దు బిల్లు

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు సభ ఆమోదం

అమరావతి: బడ్జెట్‌ సమావేశాల్లో పలు బిల్లులు శాసన సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.  సీఆర్‌డీఏను రద్దు చేస్తూ మరోసారి బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చారు. సీఆర్‌డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో పునఃప్రవేశపెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అలాగే దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులను కూడా మంత్రి వెల్లంపల్లి ప్రవేశపెట్టారు. 
 

Back to Top