ప్రజల మనసులు గెలుచుకున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి

శ్రీకాకుళం: ప్రత్యర్థులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సడలని సంకల్పంతో మొక్కవోని ధైర్యంగా ముందుకు సాగుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.ప్రజల సమస్యలు తెలుసుకుంటూ,కన్నీళ్లు తుడస్తూ ప్రజల మనస్సులను గెలుచుకున్నారన్నారు

ఎన్నో మరుపురాని ఘట్టాలు..

 వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఎన్నో మరుపురాని ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. ప్రజల సమస్యలను వైయస్‌ జగన్‌ స్వయంగా వింటూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలిచారన్నారు. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని, జగనన్న వెంట  రోడ్డు మీదకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి అడుగుల్లో అడుగేశారన్నారు.పాదయాత్రలో తెలుసుకున్న  సమస్యలన్నీ వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తారన్నారు.

 

 

Back to Top