త్వరలోనే పూర్తిగా కోలుకుని ఇంటికి వస్తా.. ఎవరూ ఆందోళన చెందొద్దు 

మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి

 

హైద‌రాబాద్‌: తనకు కరోనా సోకిందని, అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని... ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. పూర్తిగా  కోలుకుని త్వరలోనే ఇంటికి వస్తానని ఆయ‌న చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దని మంత్రి పేర్కొన్నారు. బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డికి  హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top