అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉద్దేశం

మంత్రి అవంతి శ్రీనివాస్‌

 గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్దేశమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పరిపాలన రాజధాని తరలింపు చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు.

అదే విధంగా, భవిష్యత్తులో విభజన వాదం తలెత్తకూడదనే ఈ ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top