మనస్సున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో ఎలాంటి సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధం

విశాఖ బ్రాండ్‌ ఇమేజీ దెబ్బతీసేందుకు  బాబు కుట్ర

మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ:   వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మనస్సున్న ముఖ్యమంత్రి అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కొనియాడారు. మంత్రి కన్నబాబు తో కలిసి ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై గంటల వ్యవధిలోనే సీఎంవైయస్‌ జగన్‌ స్పందించారని, బంధువులను పరామర్శించినట్లు బాధితులను సీఎం పరామర్శించి, వారిలో ధైర్యం నింపారన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సాయం ప్రకటించారన్నారు. గ్యాస్‌ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో ఎలాంటి సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రభావిత గ్రామాల్లో ఇప్పటికే మంత్రులు, ఎంపీలు బస చేశారని గుర్తు చేశారు.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చ నేతలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని తరలిస్తున్నారని, ముహూర్తం ఖారారు అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. విశాఖకు ఒక బ్రాండ్‌ ఇమేజీ ఉందని, దాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. తాను పరిపాలన చేస్తున్నప్పుడు సింగపూర్‌, మలేషియాలతో పోల్చిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం ఏదో జరిగిపోతుందంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇకనైన తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ హెచ్చరించారు.
 

Back to Top