మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి

అమరాపురం:  అమరాలపురంలో హైటెన్షన్‌ చోటు చేసుకుంది. మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై ఆందోళన కారులు దాడి చేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. పోలీసులపై నిరసనకారులు దూసుకువచ్చి రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో ఎస్పీ, డీఎస్పీతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసు టెంట్‌కు నిప్పంటించారు. రెండుప్రైవేట్‌ కాలేజీ బస్సులను తగులబెట్టారు. కలెక్టరేట్‌ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు ఈ ఘటనకు పాల్పడ్డారు.

 

Back to Top