రేపు మంత్రుల కమిటీ సమావేశం

కరోనా కట్టడి చర్యలపై సమీక్ష
 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణ కోసం ఏపీ సర్కారు ఐదుగురు మంత్రులతో ఇటీవలే కమిటీ వేసింది. ఆళ్ల నాని కన్వీనర్ కాగా... బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top