అందుకే  నాయీ బ్రహ్మణులు చంద్రబాబును ఓడించారు

దేవాదాయశాఖ మం‍త్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

కృష్ణా : గత ప్రభుత్వంలో చంద్రబాబు  నాయీ బ్రహ్మణులను ఘోరంగా అవమానించారని దేవాదాయశాఖ మం‍త్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికల్లో నాయీ బ్రహ్మణులు చంద్రబాబును ఓడించారన్నారు.  దేవాలయాల్లోని నాయీ బ్రాహ్మణుల సమస్యలపై  విజయవాడలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం  నాయీ బ్రహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కోన్నారు. త్వరలోనే వారి సమస్యలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Back to Top