ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి. ఇవాళ్టి సమావేశాల్లో  వైయ‌స్ఆర్‌సీపీ  సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కుర‌సాల క‌న్న‌బాబు,  శాసన మండలిలో మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌, ధర్మాన కృష్ణదాసు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు. తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.47 వేల 283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. చిన్నపిల్లలకు చైల్డ్ బడ్జెట్‌లో రూ.16,748.47 కోట్లు ప్రత్యేకంగా కేటాయింపులు చేయడం జరిగింది.  స‌మావేశాల్లో ప‌లు కీల‌క బిల్లుల‌కు ఆమోదం తెలుప‌గా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top