అమరావతి: సోషల్ మీడియా అక్రమ కేసులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వీటిపై సభలో చర్చించాలని కోరుతూ మండలిలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, తూమాటి మనోహర్‌రావు, మొండితోక అరుణ్‌కుమార్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.