సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

స‌త్య‌సాయి జిల్లా: ప‌రిపాల‌న‌ వికేంద్రీక‌ర‌ణ‌తో పాల‌న ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ చేసేందుకు కొత్త‌గా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల ఆ ప్రాంత ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు.  గ్రామంతో మొద‌లు రాజ‌ధాని వ‌ర‌కు వికేంద్రీక‌ర‌ణే తమ ప్ర‌భుత్వ విధానమని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అడుగులు ముందుకు వేస్తుండ‌టంతో స్థానికులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నూతన జిల్లాల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం...ఎన్నో దశాభ్దాలుగా ప్రజలు కంటున్న కలలు సాకారమయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి గారు. సత్యసాయి జిల్లా నుంచి పాలన ప్రారంభం కావడాన్ని స్వాగతిస్తూ ఆనందోత్సవాలతో  గురువారం మడకసిరలో ముఖ్యమంత్రి  చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయ‌కుడు  జయరాజు, రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ రామకృష్ణ, సింగల్ విండో అధ్యక్షులు  రామి రెడ్డి, ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top