15న ఏపీ కేబినెట్‌ భేటీ

‍తాడేప‌ల్లి: ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే కేబినెట్‌ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్‌ నియంత్రణ చర్యలపై మంత్రి మండలి చర్చించనున్నారు.  గత నెల 11న జరిగిన‌ భేటీలో వైయ‌స్సార్‌ చేయూత, జగనన్న తోడు, వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ, వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు కేబినెట్ ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు,  గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

Back to Top