అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం..

వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు చించివేత...

టీడీపీ ఆగడాలు సహించం..

వైయస్‌ఆర్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి...

అనంతపురం:టీడీపీ నేతల దౌర్జన్యాలు,ఆగడాలు రోజురోజుకు మితిమిరిపోతున్నాయి.ఇష్టారాజ్యంగా చేలరేగిపోతున్నారు.అనంతపురంలోని హమాలీ కాలనీలో మాజీ మంత్రి అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయగా..టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయులు జీర్ణించుకోలేక  వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలను చించివేశారు.ముగ్గురు టీడీపీ కార్యకర్తలను స్థానికులు పోలీసులకు అప్పగించారు.

టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వర్గీయుల దౌర్జన్యాలను నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు.అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు తీవ్రమయ్యాయని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్లెక్సీలను చించివేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

Back to Top