అనకాపల్లిలో జీవీఎంసీ అధికారుల అత్యుత్సాహం

వైయస్‌ఆర్‌ సీపీ ఫ్లెక్సీల తొలగింపు

విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలుగుదేశం ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మండిపడ్డారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలను తొలగించారని వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. అధికారుల తీరును నిరసిస్తూ అనకాపల్లి నెహ్రూ చౌక్‌ వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా అనకాపల్లికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని ప్రజలంతా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం అధికారులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top