అమ‌రావ‌తి మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు

విజ‌య‌వాడ‌:  సీఆర్‌డీఏ స్థానంలో అమ‌రావ‌తి మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. సీఆర్‌డీఏ బిల్లు ఆమోదించ‌డంతో ఇక‌పై అమ‌రావ‌తి ప‌రిధి అంతా ఏఎంఆర్‌డీఏ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్హులు జారీ చేసింది. ఏఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్‌గా ల‌క్ష్మీ న‌ర‌సింహాను నియ‌మించారు. ఏఎంఆర్‌డీఏకు ఉపాధ్య‌క్షుడిగా పుర‌పాల‌క శాఖ కార్య‌ద‌ర్శి, స‌భ్యులుగా 11 మంది అధికారులు ఉంటారు. కమిటీలో స‌భ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, ఏఎం ఆర్డీఏ క‌మిష‌న‌ర్, గుంటూరు, కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్లు, డైరెక్ట‌ర్ టౌన్ ప్లానింగ్‌,  డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ క‌మిష‌న‌ర్లు ఉంటారని ఉత్త‌ర్హుల్లో పేర్కొంది.
 

Back to Top