గోదావ‌రి జిల్లాల్లో మ‌ధ్యాహ్నం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏరియ‌ల్ వ్యూ

తాడేప‌ల్లి:  గోదావ‌రి వ‌ర‌ద‌ల కార‌ణం ముంపున‌కు గురైన ప్రాంతాల్లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ మ‌ధ్యాహ్నం ఏరియ‌ల్ వ్యూ నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలించి, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇవాళ స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని అధికారులు కుదించారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ల‌తోనే సీఎం స్పంద‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తార‌ని సీఎంవో అధికారులు వెల్ల‌డించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top