వైయస్‌ఆర్‌ సీపీలో 350 కుటుంబాలు చేరిక

గుంటూరు: కరువుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ వెలుగులు నింపుతారని వైయస్‌ఆర్‌ సీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి అన్నారు. గురజాల మండలం జంగమహేశ్వరపురంలో కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ మేరకు కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో 350 కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరాయి. కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్‌ సమన్వయకర్త కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, సమన్వయకర్త చంద్రగిరి ఏసు రత్నం, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. 

 

Back to Top