చంద్రబాబుకు బిల్డప్‌ ఎక్కువ.. పని తక్కువ

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు

కాకినాడ జిల్లా:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చే కానుక‌లు జీవితాల‌ను నిల‌బెట్టేవ‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. అచ్చంపేట జంక్ష‌న్ వద్ద ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం స‌భ‌లో క‌న్న‌బాబు మాట్లాడారు.
ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే..

అందరికీ నమస్కారం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికలకు ముందు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విజయశంఖారావాన్ని తొలిసభలో పూరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మన నాయకులు మళ్లీ ఇప్పుడు నామినేషన్ల పర్వం ప్రారంభమైన వెంటనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. మనందరి తరపున థ్యాంక్యూ సీఎం సార్ అని చెబుతున్నాం. ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో మీ పాదయాత్ర ప్రవేశించిన ఆ దృశ్యాలు మా కళ్లల్లో ఉన్నాయి. ఆ రోజు గోదావరి బ్రిడ్జి జనం తాటికి, మీ అభిమానుల ధాటికి అల్లల్లాడింది మీరు నడుస్తున్నప్ప్పుడు. మళ్లీ ఇప్పుడు చూస్తే గోదావరి జిల్లాల్లో ప్రవేశించినప్పుడు ఆనాటి కన్నా వందరెట్ల ప్రేమ కనిపిస్తోంది. సార్ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మేమందరం మీ క్షేమాన్ని కోరుకుంటున్నాం. ప్రతిరోజూ ఎంతోమంది చంద్రబాబు లాంటివాళ్లు మీమీద బండలు వేసి, అభాండాలు వేసి మీ మనస్సును ఎన్నోసార్లు గాయపరుస్తున్నారు. ఆ గాయాలేవీ బయటకి కనపడకపోయినా మొన్న మీకు నేరుగా మీపైన రాయితో దాడి చేసి మీ గాయాన్ని ఇవాళ చూసిన ఈ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.

సార్ మళ్లీ చెప్తున్నాం.. ఇలాంటి యుద్ధాలు మీకు కొత్త కాదు, మీ వెనకున్న మా సైనికులకు కొత్త కాదు. మీతోపాటు ప్రతి అడుగూ కలిపి కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పాలి.. జగనన్నకు, ఈ కుటిల నీతితో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటనేది రెండు ముక్కలు చెప్పాలనివుంది. సార్..మీతో పోలికే లేని నాయకుడు తన మందీమార్బలాన్ని, మీడియా బలాన్ని వెనకేసుకుని ప్రతిరోజూ బురద జల్లే కార్యక్రమం చేస్తుంటే మీతో పోలికా అని మేమందరం అనుకుంటున్నాం. మీరు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానంటుంటే చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని అందిస్తానంటున్నాడు ఇదిచాలు మీకు, ఆయనకు ఉన్న పోలిక.

చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే.. చంద్రన్నకానుక అని ఆయన ఉన్నప్పుడు ఒక చిన్న కార్యక్రమాన్ని చేశాడు. చంద్రన్నకానుక క్రింద ఏమిచ్చేవారంటే..అరకేజీ బెల్లం, కేజీ గోధుమ పిండి, 100 గ్రాముల హెరిటేజ్ నెయ్యి ఇచ్చేవాడు. అదికూడా సంక్రాంతికి మాత్రమే ఇచ్చేవాడు, అరకేజీ బెల్లంతో పండుగ చేసుకోమనేవాడు. కానీ ఈరోజు జగనన్న మీరు ఇచ్చే కానుకలు జీవితాలను నిలబెట్టేవి, భవిష్యత్ తరాలకు తలరాత రాసేవి. ఇంగ్లీష్ మీడియం మొదలుకుని వైద్యం, విద్య, ఆరోగ్యాల్లో ఒక విప్లవాన్ని మీరు సృష్టించారు. ఇంటి స్థలం, వైద్యం, ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఎన్నో కానుకలు మీరు అందించి చేయూత, భరోసాలాంటివి కూడా అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ కానుకలు గొప్పవా ఆ కానుకలు గొప్పవా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంటింటికీ మీరు పెన్షన్ పంపిస్తుంటే, ఆ పెన్షన్లను పంపిణీ చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై దాడి చేసి అదేదో మిమ్మల్ని కట్టడి చేయగలుగుతామని వారు భ్రమల్లో ఉన్నారు.

అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తానని చంద్రబాబు చెప్తున్నాడు. అదే పెద్ద మనిషి తాను అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన జన్మభూమి కమిటీలను కంటిన్యూ చేస్తానని చెప్పలేడు అంటేనే మీకూ ఆయనకు ఉన్న తేడా, మీ విజన్ కు ఆయన విజన్ కు ఉన్న తేడా అర్థమవుతుంది. ఎన్డీఏను నమ్మండి అని చెప్తున్నాడు, కానీ తనను నమ్మండి అని చంద్రబాబు ఎక్కడా ఈ మధ్యకాలంలో చెప్పడంలేదు. ఎన్డీఏను నమ్మండి, మా కూటమిని నమ్మండి అని అంటున్నాడు కానీ చంద్రబాబు పొలిటికల్ డీఎన్ఏ తెలిసినవాడు ఎవరూ ఎన్డీఏ కూటమిని నమ్మే పరిస్థితి లేదు. ప్రతిసారి యుద్ధం యుద్ధం అని మాట్లాడుతున్నారు, ఇవాళ వాళ్లు యుద్ధం అంటే మీరు సిద్ధం అన్నారు. మీరు సిద్ధం అన్నవెంటనే ఒక్కసారిగా మేమంతా సిద్ధమని మీవెనకాలే వచ్చామన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. సార్.. చివరగా ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.

మా దగ్గర తీరప్రాంతంలో మత్స్యకారులు ఒక సమస్యను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఈ తీరప్రాంతంలో ఓఎన్జీసీ ఒక సిసిమిక్ సర్వేను చేపట్టి ఆ కాలంలో 500 కిలోమీటర్ల మేరకు ఎక్కడా మత్స్యకారులు వేట చేయకూడదు, 35 కిలోమీటర్లు నో మ్యాన్ జోన్ అని ప్రకటించినప్పుడు మత్స్యకారులు ఆందోళనలో ఉంటే వారికి అండగా నిలబడి రాజకీయాలకతీతంగా ఒక ఉద్యమాన్ని చేశాం. సుమారు 18 రోజులపాటు ఉద్యమం జరిగితే మీ దృష్టికి దాన్ని తీసికొచ్చినప్పుడు మత్స్యకారులకు అండగా ఉండమని చెప్పారు. ఆ ఉద్యమం ఫలితంగా ఒక కమిటీని నియమించారు. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మీరు తప్పకుండా మా ప్రాంత మత్స్యకారులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరకుంటున్నాను. మీ పాతికేళ్ల ప్రస్థానం.. ఇంకా భవిష్యత్ లో రాజకీయ ప్రస్థానంలో మేమందరం అండగా మీవెనుక నడుస్తామని మేమంతా సిద్ధమని మీకు ప్రమాణం చేస్తున్నాం..

Back to Top