తూర్పు గోదావరి జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం 19వ రోజు శనివారం (ఏప్రిల్ 20) షెడ్యూల్‌ను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.