మా అమ్మ‌ను ఉద్యోగం నుంచి తీసేశారు..


 కస్తూర్బా గాంధీ స్కూల్‌లో మా అమ్మ పనిచేస్తుంటే.. మా అమ్మను ఉద్యోగం నుంచి తీసేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసేశారు. స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తుంది సార్‌ మా అమ్మ
వైయస్‌ జగన్‌: పాదయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు మోడల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్లు వచ్చి.. ప్రతి మండలానికి ఒక మోడల్‌ స్కూల్‌ కట్టి అన్ని వసతులు కల్పించాలని కేంద్రం ఏర్పాటు చేసింది. ఎనిమిది నెలల నుంచి మోడల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. చదువులు చెప్పలేని పరిస్థితిలో ఉంటే స్కూల్‌లు ఎలా నడుస్తాయనే కనీస ఆలోచన లేదు. 
ఇంతకు ముంద 108, 104 ఫోన్‌ కొడితే కుయ్,,కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో సౌండ్‌ వినిపించేది. కానీ ఈ రోజు వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఇలా ఏం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ను చూసినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి.
–––––––––––––––––––––––
రుణాలు మాఫీ కాలేదు..
పొదుపు రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటి వరకు మాఫీ చేయలేదు. ఇంటికి నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పెన్షన్లు కూడా తీసేస్తున్నాడు.
వైయ‌స్ జ‌గ‌న్‌: చంద్రబాబు నాయుడు మోసం ఎలాంటిదంటే అందరికీ మూడు వేలు అని చెబుతున్నాడు.. ఇచ్చిన బ్యాంక్‌ల వారు వడ్డీలు కట్టమంటున్నాయి. ఆరోజు మాఫీ చేస్తామన్నారు. ఈ రోజు వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు.. ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడు.
––––––––––––––––––––
ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేదు: స‌మీనా
చంద్రబాబు గతంలో 9 సంవత్సరాలు పరిపాలించాడు.. ఇప్పుడు 4 సంవత్సరాలుగా పాలన చేస్తున్నాడు.. ఎన్నో వందల హామీలు ఇచ్చాడు.. అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ మన జగనన్న వస్తే హామీలన్నీ నెరవేరుతాయి. జరిగిన వాస్తవాలు.. జరుగుతున్న అన్యాయాలు చూసుకొని జగనన్నకు ఓటు వేయాలి. వడ్డీలకు చక్రవడ్డీలు వేసి మోసం చేస్తున్నారు. 
––––––––––––––––––
ఒక్క ఇల్లు కూడా ఇవ్వ‌లేదు..
హరిత: మాది వెంకటాపురం గ్రామం.. మా గ్రామానికి 27 ఇళ్లు వచ్చాయి. మేం కాటసాని రామిరెడ్డి వెంట ఉండి ఓటు వేశామని మా గ్రామానికి ఒక్క ఇళ్లు ఇవ్వలేదు. మా ఊర్లో దాదాపుగా వెయ్యి ఓట్లు ఉంటాయి. ఇల్లు కోసం మా అమ్మ పేరుతో స్లిప్పుతో వస్తే ఆ స్లిప్పు కూడా ఇవ్వలేదు. వాళ్ల వారికి ఇళ్లు ఇచ్చుకుంటున్నారు.
వైయస్‌ జగన్‌: ఊరికి పది ఇళ్లు ఇస్తే అదే గొప్ప సంగతా..ఆ ఇళ్లు కూడా జన్మభూమి కమిటీ సభ్యులు పంచుకోవడానికే సరిపోతాయి. లంచాలు ఇచ్చిన వారికే ఇస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడం లేదు.
––––––––––––––––––
పింఛ‌న్ రావ‌డం లేదు..
చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటి వరకు పెన్షన్‌ అందలేదు.. సార్‌.. నా మొగుడు చనిపోయినా వితంతువు పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు. నాన్న ఉన్నప్పుడు నాకు రూ. 200 వచ్చాయి. ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. 
–––––––––––––––––––––
బ్యాంకులో పెట్టిన బంగారం అక్క‌డే ఉంది:  రామలక్ష్మమ్మ
అన్నా..కాట‌సాని రామిరెడ్డికి ఓటు వేశామని మా ఊరుకు  రోడ్డు కూడా వేయలేదు. నిక్కరమెట్ల గ్రామం. పొదుపు సంఘాల్లో రూ. 3 లక్షలు తీసుకొని వడ్డీతో సహా కట్టేశాను. బ్యాంక్‌లో పెట్టిన బంగారం అక్కడే ఉంది. వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నారు.. చాలా ఇబ్బందిగా ఉంది సార్‌. 
–––––––––––––––––––
జీతాలు ఇవ్వ‌డం లేదు:  జ్యోతి, ఆశావ‌ర్క‌ర్‌
అన్నా.. నేను ఆశావర్కర్‌గా ప‌నిచేస్తున్నాను. మాకు 7, 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. చంద్రబాబును అడిగితే ఆశా వర్కర్లు అంటే ఎవరూ అని అడుగుతున్నారు.. చనిపోయిన వారికి సమాధానం చెప్పాలి. బతికిన వాడికి మేమే సమాధానం చేయాలి. పని చెబుతున్నారు కానీ జీతాలు ఇవ్వడం లేదు. కుష్టు వ్యాధి గురించి 15 రోజులు సర్వేచేయమన్నారు. ఇవాళ్టికి 9 రోజులు అవుతుంది. జీతాలు ఇవ్వకుంటే.. మేం పని ఎలా చేయాలి. 
Back to Top