దివ్యాంగుల సమస్యలు విన్న జననేత

బేతంచర్ల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు శ్రీసాయి వికలాంగుల సేవా సమితి సభ్యులు మద్దతు తెలిపారు. యాత్రు సంఘీభావం తెలుపుతూ తమ సమస్యలను పరిష్కరించాలని, రూ.5 వేల పెన్షన్‌ అందించాలని జననేతను కోరారు. టీడీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డులోని ఒకరికే పెన్షన్‌ ఇవ్వాలని కండీషన్‌ పెట్టిందన్నారు. ఒక రేషన్‌ కార్డులో ఉన్న వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్‌ అందించాలన్నారు. ఎన్‌ఆర్డీపీ కింద రూ. 5 వేలు ఇవ్వాలని కోరామని, వైయస్‌ జగన్‌ తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామన్నారని సేవా సమితి సభ్యులు చెప్పారు. వికలాంగులుగా అన్ని సర్టిఫికెట్లు ఉన్నా.. పెన్షన్‌ అందడం లేదని వారు వాపోయారు. వైయస్‌ జగన్‌ మాకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉందన్నారు. 
Back to Top