దేవుడు వ‌చ్చిన‌ట్లు భావిస్తున్నాం

ఆళ్ల‌గ‌డ్డ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ ఇంటికి రావ‌డంతో దేవుడు వ‌చ్చిన‌ట్లు ఉంద‌ని వెంక‌టేశ్వ‌ర్లు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. పెద్ద‌కోట కందుకూరు గ్రామంలో పాద‌యాత్ర చేసిన వైయ‌స్ జ‌గ‌న్ వెంక‌టేశ్వ‌ర్లు అనే వ్య‌క్తి పూరి గుడిసెలోకి వెళ్లారు. వారి స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌మ‌కు ప్ర‌భుత్వం ప‌క్కా ఇల్లు మంజూరు చేయ‌క‌పోవ‌డంతో పూడి గుడిసెకు టార్పాలిన్ ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నామ‌ని, చేలో పండిప ప‌త్తిని కూడా గుడిసెలోనే దాచుకోవాల్సి వ‌చ్చింద‌ని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. వారి బాధ‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ త్వ‌ర‌లోనే మంచి రోజులు వ‌స్తాయ‌ని హామీ ఇచ్చారు.
Back to Top