స్లాబ్‌ సిస్టం వచ్చేవిధంగా చర్యలు తీసుకోండి

అనంత‌పురం: స‌్లాబ్ సిస్టం వ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాడిపత్రి గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వారు వైయ‌స్ జగన్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు ‘విద్యుత్‌ బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయి. స్లాబ్‌ సిస్టం వచ్చేవిధంగా చర్యలు తీసుకోండి. నగదు రాయితీతో పాటు వడ్డీ రాయితీ కావాలి. 1 శాతం పన్ను ఇవ్వాలి. చిత్తూరు జిల్లా కుప్పం వరకు మాత్రమే 50 శాతం రాయితీ వర్తిస్తోంది. ముడిసరుకు రాయల్టీ తగ్గించేలా చర్యలు తీసుకోండి అని వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు.   గ్రానైట్‌ పరిశ్రమల సమస్యలపై పోరాడి, అండగా ఉంటామని వైయ‌స్‌ జగన్ వారికి హామీ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top