ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదని వెనక్కి పంపారన్నా...



ఆత్మకూరు: ‘నాపేరు రామలక్ష్మమ్మ. మాది వెంకటగిరి గ్రామం. నా కొడుకు కార్తీక్‌.. రెండేళ్ల వయసన్నా.. వీడి గుండెకు రంద్రాలు పడడంతో హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశారు..అయితే మళ్లీ ఇంకోసారి ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు సూచించారు. ఇప్పుడేమో హైదరాబాద్‌కు వెళ్తే మీది ఈ రాష్ట్రం కాదు.. ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదని వెనక్కి పంపారన్నా. ఎలాగైనా మీరే నా కుమారుడికి ఆపరేషన్‌ చేయించి ఆదుకోవాలి’ అని ఆ మహిళ వైయ‌స్‌ జగన్‌ను వేడుకుంది. ఇందుకు జ‌న‌నేత స్పందిస్తూ ‘హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ కార్డులకు వైద్యం చేయడం లేదు. ఈ టీడీపీ ప్రభుత్వం దౌర్భాగ్యంగా ఉంది. నేను కచ్చితంగా ఆపరేషన్‌ చేయిస్తానమ్మా. మీరు తిరుపతికి తీసుకుని వెళ్లండి. మన పార్టీ కార్యకర్తలు అక్కడ ఆపరేషన్‌ చేయిస్తారమ్మా’ అని ఆ మహిళకు హామీ ఇస్తూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆ మహిళ ‘జగనన్న నా కుమారుడికి ఆపరేషన్‌ చేయిస్తానన్నారని సంబరపడింది.

పోలియో సోకింది.. ఆదుకోండన్నా..  
ఆత్మకూరు: ‘నాపేరు శివలీలావతి అన్నా.. నాకు పోలియో సోకింది. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాను అన్నా’ అని ముద్దవరం గ్రామానికి చెందిన శివలీలావతి వైయ‌స్‌ జగన్‌కు తన పరిస్థితిని వివరించింది. సమస్య విన్న వైయ‌స్‌ జగన్‌ సత్వరమే ఆమెకు వైద్య పరీక్షలు చేయించాలని స్థానిక నాయకులను ఆదేశించారు.


తాజా వీడియోలు

Back to Top