సీపీఎస్‌ ఉద్యోగుల హ‌ర్షం

కర్నూలు : ఉద్యోగులు ఎదుర్కొంటున్న ‘సీపీఎస్‌’ సమస్యను పరిష్కరిస్తామని వైయ‌స్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇవ్వ‌డం ప‌ట్ల ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.  ఆళ్లగడ్డలో మృతి చెందిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలను గురువారం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి కలుసుకున్నారు. సీపీఎస్‌ విదానం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని పీఈటీ సురేష్‌, తెలుగు పండిట్‌ సురేష్‌ల కుటుంబాలు వైయ‌స్‌ జగన్‌కు వివరించాయి. ఇప్పటివరకూ ఒక్క రూపాయి పెన్షన్‌ కూడా తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశాయి.  సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేసింది. 
Back to Top