మోసపోయి ఓట్లు వేశాం


నెల్లూరు: బాబు వస్తే జాబు వస్తుందని మోసపోయి ఓట్లు వేశాం. ఒక్క ఉదోగ్యం కూడా ఇవ్వలేదు అంటూ నిరుద్యోగ యువత ‘బాబు వస్తే జాబు అన్నావు.. జాబు ఎక్కడ బాబూ’ అనే నినాదం ఉన్న ప్లకార్డులతో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట తమ బాధను వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం చెన్నూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున యువత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం ప్రకటించిన నిరుద్యోగ భృతి కూడా ఇప్పటి వరకు అందలేదని వాపోయారు. ప్రత్యేక హోదా ఉంటే ఇలాంటి బాధలు ఉండేవి కావని, దీనికి కోసం శ్రమిస్తామని యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Back to Top