ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు

 
చిత్తూరు :‘జాబు రావాలంటే బాబు రావా లి.. అని మమ్మల్ని మోసంచేసినారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. మా ఊర్లో ఏ ఒక్క కుటుం బానికీ ఈ నాలుగేళ్లలో ఉద్యోగం రాలేదు. డిగ్రీ చేసిన వాళ్లకు నెలనెలా భృతి ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చెబతా ఉండామన్నా... జాబు రావాలంటే బాబు పాలన పోవాలి..’ అంటూ అగ్గిచేనుపల్లెకు చెందిన యువకులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత నెరవేర్చని హామీలను ప్లకార్డుల రూపంలో ప్రజాసంకల్పయాత్రలో ప్రదర్శించారు. హామీలను అమల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు
Back to Top