యాద‌వుల సంక్షేమాన్ని విస్మ‌రించారు

చిత్తూరు: టీడీపీ ప్రభుత్వంలో యాదవుల సంక్షేమాన్ని గాలికి వ‌దిలేశార‌ని యాదవ సంఘ నాయకులు కొమ్ము చెంచయ్యయాదవ్‌ తదితరులు వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో వారు జననేతను కలసి యాదవుల సమస్యలు వివరించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే  న్యాయం చేస్తామని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. అనంతరం యాదవులు గొర్రెపిల్ల, కంబళిని జననేతకు కానుకగా ఇచ్చి ఆత్మీయంగా సత్కరించారు
Back to Top