టీడీపీ నాయ‌కులు వేధిస్తున్నారు

చిత్తూరు: అధికారంలో ఉండేది మా పార్టీ. నువ్వు తీసిచ్చిన బ్యాంకు లోను మా సీఎం తోసేస్తామన్నాడు. మేం బ్యాంక్‌కు లోను కట్టం. నీకు దిక్కున్నచోట చెప్పుకో..’ అంటూ స్థానిక టీడీపీ నాయకులు వేధిస్తున్నారని పాత వేపకుప్పానికి చెందిన మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. జననేతను కలిసి తమ సమస్యలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను జామీనుగా ఉండి బ్యాంకు నుంచి తీసిచ్చిన రూ.1.25 లక్షల్ని స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు చెల్లించకుండా అడిగితే దాడులు చేస్తున్నారని ఆమె వాపోయారు. వైయ‌స్‌ఆర్‌ హయాంలో ఇచ్చిన వృద్ధాప్య పింఛన్లను  తొలగించి, టీడీపీ మద్దతుదారులకు కట్టబెడుతున్నారని తెలిపారు.   
Back to Top