ప్రభుత్వ పథకాలేవీ తమ దరికి చేరటం లేదు

గుంటూరు:  వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతి పరులమని ప్రభుత్వ పథకాల్లో వివక్ష చూపుతున్నారని నందిగామ గ్రామానికి చెందిన ముస్లిం మహిళలు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నందిగామకు చేరుకున్న జననేత వైయ‌స్‌ జగన్‌ను ముస్లిం మహిళలు కలిశారు. ప్రభుత్వ పథకాలేవీ తమ దరికి చేరటం లేదని మహిళలు వాపోయారు. ఇళ్ల మంజూరులో వివక్ష చూపుతున్నారని, ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను గాలికి వదిలేశారని, ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వివరించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top