భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా..

నెల్లూరు : కుటుంబానికి ఆధారమైన భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా అధికారులు వితంతు పింఛన్‌ మంజూరు చేయలేదంటూ ఆర్లపాడుకు చెందిన బండి రమణమ్మ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పునబాక తూర్పు తట్టు కండ్రిగ నుంచి చెన్నప్పనాయుడుపేటకు పాదయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద వృద్ధురాలు రమణమ్మ కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు కనీసం వితంతు పింఛన్‌ను కూడా మంజూరు చేయడంలేదని వాపోయారు. నాలుగు నెలలుగా వేలిముద్రలు సక్రమంగా నమోదు కావడం లేదంటూ రేషన్‌ సరుకులను కూడా ఇవ్వడం లేదని తెలియజేశారు. త్వరలోనే వైయ‌స్ఆ ర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరికీ న్యాయం చేస్తామని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
Back to Top