ఎన్టీఆర్‌ హెల్త్‌ కార్డు చెల్ల‌డం లేద‌న్నా..

 చిత్తూరు: ‘అయ్యా..! నా భర్త రఘు, నేను కలికిరి టమాట మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నాం. మాకు ముగ్గురు కుమార్తెలు. ఆఖరి బిడ్డ సంధ్య డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ అనారోగ్యానికి గురైంది.  చెన్నైకి తీసుకెళ్లాం. లివర్‌ సంబంధిత వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. బతికున్నంత కాలం మందులు వాడాలని చెప్పారు. ఇప్పటికే నాలుగు లక్షల దాకా అప్పుచేసి ఖర్చుచేశాం. ఎన్టీఆర్‌ హెల్త్‌ కార్డు ఉన్నా చెల్లకుండా పోయింది’ అంటూ కలికిరి మాదిగపల్లెకు చెందిన నిర్మల వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ఎదుట కన్నీళ్లు పెట్టారు. తమ ప్రభుత్వం
అధికారంలోకి వస్తానే అన్ని ఆపరేషన్లు ఆరోగ్యశ్రీకి వర్తించేలా చూస్తామని జననేత హామీ ఇచ్చారు.
Back to Top