చంద్రబాబుపై మహిళల ఆగ్రహం

చిత్తూరు: నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదని చిత్తూరు జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొట్టాల క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మహిళలు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. నాలుగేళ్లుగా రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, జన్మభూమి కమిటీల్లో అర్జీలు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. పసుపు కుంకుమ అన్నారు..ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇచ్చిన ఒక్క మాట కూడా నెరవేర్చలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండలో అంగన్‌వాడీ కేంద్రం లేదని గిరిజనులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.
 
Back to Top