బాబు పాలనపై మహిళల ఆగ్రహం

 
అనంతపురం: చంద్రబాబు పాలనపై అనంతపురం జిల్లా శింగనమల మండల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాపినేనిపాలెం మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ రుణాలు మాఫీ కాలేదని పేర్కొన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో ఇంటికి నోటీసులు వస్తున్నాయని వాపోయారు. మీరే ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ను కోరారు.
 
Back to Top