మాకు న్యాయం జ‌ర‌గ‌దా అన్నా?

జ‌న‌నేత వ‌ద్ద ఓ మ‌హిళ ఆవేద‌న 
తూర్పుగోదావ‌రి జిల్లా: ``అన్నా నా భ‌ర్త జోగిరాజు వ్య‌వ‌సాయం చేస్తూ, అప్పుల‌పాలై ఆర్థిక ఇబ్బందుల‌తో 2015లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడ‌న్నా.  నాడు  ప్ర‌భుత్వం నుంచి రూ.5 ల‌క్ష‌ల సాయం చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పాడ‌న్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు న‌యాపైసా ఇవ్వ‌లేద‌న్నా`` అంటూ నూక‌ర‌త్నం అనే మ‌హిళ జ‌న‌నేత వైయ‌స్‌జ‌గ‌న్ వ‌ద్ద త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. మాలాంటి వాళ్ల‌ను ప్ర‌భుత్వం ఆదుకోక‌పోతే మేము ఎలా బ‌త‌కాల‌న్నా అంటూ బోరును ఏడ్చింది. ఆమె బాధ‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ ఆమెకు ధైర్యం చెప్పారు. సాయం అందేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెద్దామ‌ని చెప్పారు. మీ కుటుంబానికి నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చారు వైయ‌స్ జ‌గ‌న్‌.
Back to Top