పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంతో

నెల్లూరు: ‘మేము నాలుగున్నర ఎకరాల పొలం 20 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నాం.. దానికి సంబంధించి పట్టాలు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారయ్యా’ అంటూ  వేల్పూరు రామతులసమ్మ అనే మహిళ సోమవారం అయ్యపురెడ్డిపాళెం వద్ద వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించింది. గ్రామ సభల్లో పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా లాభం లేదని వాపోయింది. పాసుపుస్తకాలు ఇవ్వకపోవడంతో రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ లాంటి రైతులను అధికారులు ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఏమిటని కన్నీటి పర్యంతమైంది. స్పందించిన జననేత వైయ‌స్‌ జగన్‌ మన ప్రభుత్వం వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. 

Back to Top