కేసులు పెట్టి వేధిస్తున్నారు

పశ్చిమగోదావరి : అన్నా.. నాకు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటే ప్రాణం. ఆయన మరణం తరువాత మీరు పెట్టిన వైయ‌స్ఆర్‌ సీపీ జెండా మోస్తున్నా. నాపై టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఎ.గోపవరానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ ప్రజాసంకల్ప యాత్ర చేస్తోన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని తన ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డిని పాదయాత్రలో కలుసుకున్నానని, ఆయన దీవించిన ఫొటోలు చూపించారు. తండ్రి లాగానే వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా నాగదేవిని ఆశీర్వదించడంతో సంతోషం వ్యక్తం చేశారు.
Back to Top